సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం అన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఉదయం పుట్టపర్తి మండలం కేంద్రం శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గర గల ప్రశాంతి గ్రామం పోస్ట్ ఆఫీస్ వీధి లోని లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పింఛనుదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పథకాల లబ్దిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.