నకరికల్లు లో పాడి పశువులు ఉన్న రైతులు గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ నిర్వహించుకోవాలి పశు వైద్యులు వెంకటేశ్వర్లు నాయక్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం నకరికల్లు మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఏరియా పశు వైద్యులు వెంకటేశ్వర్లు నాయక్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో పాడి పశువులు ఉన్న రైతులు గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధికి సంబంధించి పశువులకు జ్వరం విపరీతంగా రావడం పాల దిగుబడి తగ్గడం పశువులు నిరసించిపోతాయంటూ పేర్కొన్నారు. కావున రైతులందరూ కూడా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకా వ్యాక్సిన్ ను నిర్వహించుకోవాలన్నారు.