జాజిరెడ్డి గూడెం: అరవపల్లి లో బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగామా రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం బైక్ అదుపు తప్పి రోడ్డు మధ్య డివైడర్ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తి మోతే మండలం రాఘవపురంకి చెందిన సైదులుగా గుర్తించారు. పోలీసులు, స్థానికులు 108లో గాయాలైన సైదులును చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు.