తాడేపల్లిగూడెం: పెదతాడేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతులు నిమిత్తం రేపు శుక్రవారం నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం.
తాడేపల్లిగూడెం పెదతాడేపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తాడేపల్లిగూడెం ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెదతాడేపల్లి సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతులు నిమిత్తం తాడేపల్లిగూడెం పట్టణ మరియు రూరల్ ప్రాంతాల్లో అలాగే పెంటపాడు మండలంలో విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.