అసిఫాబాద్: గుండి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి, ఆరుగురిపై కేసు నమోదు చేసిన ఆసిఫాబాద్ పోలీసులు
ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ASF పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేసి ఆరు గురుని పట్టుకున్నట్లు ASF సిఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీస్ సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2,200 నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, అరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.