పీలేరు మండలం పీలేరు పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద నడిమి కండ్రిగ సుధాకర్ బాబు అధ్యక్షతన గురువారం పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీలేరు చుట్టుపక్కల ప్రజల మనోభావాలు గౌరవించి పీలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీ నేపథ్యంలో మదనపల్లి ని జిల్లాగా ప్రకటిస్తుండడం హర్షనీయమని అన్నారు. చిత్తూరు రాయచోటి తిరుపతి మదనపల్లి ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్న పీలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలన్నారు