పెడన: ఆకులమన్నాడు గంగానమ్మ ఆలయంలో చోరీ
పెడన నియోజకవర్గం ఆకులమన్నాడు గ్రామంలో గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవస్థానంలో చోరీ జరిగింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి హుండీలోని నగదు, అమ్మవారి మెడలోని సూత్రాలు మరికొన్ని విలువైన ఆభరణాలు అపహరించారు. ఈ సంఘటనపై గ్రామస్థులు మంగళవారం ఉదయం పెడన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.