నంద్యాల జిల్లాఅవుకు మండలం రామాపురం యూనియన్ బ్యాంకు అధికారుల తీరుపై మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ రైతులు బ్యాంకుకు తాళం వేశారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహించే శ్రీనివాసులు 2018లో 19 మంది రైతులపై నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ విషయం అప్పట్లోనే బయటపడినప్పటికీ ఆరేళ్లుగా బ్యాంకు అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో తాళం వేసి నిరసన తెలిపారు.