భారీ వర్షాలతో పొంగిన ముదిగొండ వాగు. స్తంభించిన రాకపోకలు. పరిశీలించిన జెసి
Ongole Urban, Prakasam | Oct 22, 2025
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఒంగోలు రూరల్ మండలం గుత్తికొండ వారి పాలెం వద్ద ముదిగొండ వాగు పొంగింది. దీంతో గుత్తికొండ వారి పాలెం నుండి ఒంగోలుకు రాకపోకలు ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ముదిగొండ వాగు వద్దకు చేరుకొని వాగుకు వెళ్లే రహదారి వద్ద ముళ్లకంచిన అడ్డుగా వేయించాడు. ఎవరు కూడా వాగును దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించాడు. స్థానిక వీఆర్వో వీవోలు ప్రజలు వాగును దాటకుండా చూడాలని తెలియజేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు ఉధృతి తగ్గేవరకు