సర్వేపల్లి: సెప్టెంబర్ 18 నుంచి కసుమూరు గంధమహోత్సవం, ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
సెప్టెంబర్ 18 నుంచి జరుగనున్న కసుమూరు శ్రీ హజరత్ మస్తాన్ వలి గంధోత్సవం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ఏపీ నెల్లూరు ఆర్&బీ అతిథిగృహంలో ఆర్డీఓ అనూషా, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్ షేక్ ఖుదావన్, ఈఓ షేక్ షరీఫ్ తో కలిసి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేసారు. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.