అసిఫాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లతో జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు.