మహిళల శాంతి భద్రతకు పెద్ద పీట: నెల్లూరు SP
మహిళల శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని నెల్లూరు SP అజిత వాజెండ్ల తెలిపారు. ఆమె సోమవారం SPగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో లా&ఆర్డర్ పరిరక్షణకు మొదటి ప్రాదాన్యతను ఇస్తామని, రౌడీల ఆగడాలను అరికడతామని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, జిల్లాలో జరుగుతున్న క్లైమ్ని అరికట్టేందుకు అందరి సమన్వయంతో ముందుకెళ్తానని ప్రకటించారు.