ఉదయగిరి: వెలిగండ్ల వద్ద బైక్ ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
కొండాపురం మండలం,వెలిగండ్ల వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి వెలిగండ్లకు వచ్చి వెళుతున్న బైకును వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి, వెనకాలే ఉన్న మహిళకు గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను కొండాపురం వైద్య శాలకు తరలించారు.