గుంతకల్లు: గుత్తి మండలం కరిడికొండ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆటో, బైక్ ఢీ, ఇద్దరికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని కరిడికొండ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరిడికొండ శివారులో గుత్తి వైపునకు వస్తున్న ఆటో డీజల్ వేయించుకునేందుకు బంకులోకి వెళ్తున్న క్రమంలో ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ప్రమాదంలో అప్పెచెర్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ, ధర్మాపురం గ్రామానికి చెందిన సురేష్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.