కుందుర్పి మండల కేంద్రంలో శుక్రవారం తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. కుందుర్పి మండల కేంద్రంలోని విద్యుత్ నగర్ కాలనీకి చెందిన మహిళలు కాలనీ వద్ద నుంచి ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బయట నుంచి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. మూడు నెలలుగా కొళాయిలకు తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.