దేవరకొండ: ఇందిరాగాంధీ త్యాగఫలమే ఎస్టి రిజర్వేషన్లు: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
నల్గొండ జిల్లా: ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసి నేటికీ 50 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి బంజారా సంఘం జాతీయ నాయకులు రవీంద్ర నాయక్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తో కలిసి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బాలు నాయక్ ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ అడవులలో నివసించే గిరిజనుల దయానియస్థితిని అర్థం చేసుకొని గిరిజన సమాజానికి వెలుగులు నింపాలన సంకల్పంతోనే భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు.