మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుగా గోవిందపురం గ్రామం ఎంపిక : డ్వామా పిడి అడపా వెంకటలక్ష్మి
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గిరిజన కాలనీని జగ్గంపేట ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ద్వామా పిడి అడపా వెంకటలక్ష్మి గురువారం సాయంత్రం అధికారులు,సిబ్బందితో పరిశీలించారు.ఈ సందర్భంగా పిడి వెంకటలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి మ్యాజిక్ డ్రైనేజీని నిర్మించేందుకు చర్యలు చేపట్టమన్నారు.