టేక్మల్: అంగన్వాడి కేంద్రంలో పోషక ఆహారంపై అవగాహన సదస్సు నిర్వహించిన సూపర్వైజర్ శైలజ
Tekmal, Medak | Sep 20, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం ఎల్లుపేటలోని ముత్యాల బంధం తాండ అంగన్వాడి కేంద్రంలో శనివారం నాడు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సుప్రవైజర్ మాట్లాడుతూ స్థానికంగా లభించే కూరగాయలు ఆకుకూరలు తినాలని మహిళలు గర్భిణీలకు సూచించారు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనత రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.