దర్శి: రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలోని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వర్షం నీటితో నిండి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఉన్న రెండు బ్రిడ్జిలలో గత నాలుగు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొన్నది అన్నారు. చిన్నపాటి వర్షం పడితే వర్షం నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. తప్పని పరిస్థితులలో ఆ నీటిలో నుండే వెళ్లాలన్నారు. సంబంధిత రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు