మంత్రాలయం: పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చు :బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్
కోసిగి:పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం కోసిగిలో ఏవో వరప్రసాద్ ఆధ్వర్యంలో ATMA చే రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం గ్రామ శివారుల్లో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించారు.