తాడిపత్రిలోని భక్తులకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల లడ్డూలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుమల నుంచి లడ్డూలను వాహనాల్లో తెప్పించారు. వాటిని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో భద్రపరిచారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరికీ లడ్డూలను పంపిణీ చేనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.