హిమాయత్ నగర్: కూకట్పల్లి లో బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో అపశృతి, కరెంట్ షాక్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలు
కూకట్పల్లిలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో బతుకమ్మ పండుగ ఏర్పాటలో అపశృతి చోటు చేసుకుంది. మాధవరం కాలనీలో భారీ ఆకారంలో బతుకమ్మను పేరిచారు. బతుకమ్మను తీసుకెళ్లే క్రమంలో హై టెన్షన్ వైర్లకు బతుకమ్మ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.