పట్టణములోని బుక్కా బుక్కాపురం తిమ్మారెడ్డి వృషభలు రికార్డు సృష్టించాయి : 8 గంటల్లో 20 ఎకరాల పొగాకు పాపనం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బుక్కాపురం తిమ్మారెడ్డి వృషబాలు రికార్డు సృష్టించాయి. 8 గంటలలో 20 ఎకరాలు పొగాకు పొలంలో 2 గుంటిక లతో బుధవారం పాపనం పాయడం జరిగింది. నందికొట్కూరుకు చెందిన రైతు చింతలపల్లి సత్యనారాయణ సమ్మర్ స్టోరేజ్ నీటి ట్యాంక్ సమీపంలో వడ్డెమాన్ రాస్తాలో 20 ఎకరాలు కౌలుకు తీసుకోని పొగాకు పంట సాగుచేశాడు.ఏడు విత్తనాలు కలిగిన ఎద్దులతో తిమ్మారెడ్డి కుమారులు భాను ప్రకాష్ రెడ్డి, శివారెడ్డి లు కమల్ సాహెబ్ తో కలిసి పాపనం పాశారు. ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 2గంటలకు పూర్తి చేశారు. రికార్డు సృష్టించిన వృషభాలను తిలకించేందుకు రైతులు పొలం వద్దకు తరలివచ్చార