స్థల యజమాని అనుమతి లేకుండా బార్ ఏర్పాటు, నిడదవోలులో ఘటన
నిడదవోలు సుబ్బరాజుపేటలో తన అనుమతి లేకుండా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడంపై స్థల యజమాని రాజు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే బార్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు. సిఐటియు నాయకులు జువ్వల రాంబాబు సహకారంతో స్థానికులు ఆందోళనకు దిగి టెంట్లలో ఏర్పాటు చేసిన బార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.