అసిఫాబాద్: కెరమెరిలో యూరియా దొరక్క రైతుల అష్టకష్టాలు
ఏరువాక సాగాల్సిన రైతన్నలు యూరియా కోసం ఉదయం నుంచి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని సహకార సొసైటీ వద్ద ఉదయం నుంచి రైతులు క్యూ లైన్ లో బాలురు తీరారు. ఎప్పుడొస్తారో ఎన్ని ఇస్తారో అవసరమైన యూరియాను అందిస్తారో లేదో అనే అయోమయ పరిస్థితిలో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక యూరియా బస్తకోసం రైతుల ఇబ్బందులు పడుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో సకాలంలో ఎరువులు పంటకు అందించకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని అందుకోసం పంట పొలాలకు వెళ్లాల్సిన రైతులు ఉదయం నుంచి యూరియా కోసం క్యూలైన్ లలో వేచి ఉంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.