శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తున్న భవానీ భక్తులకు ఆదివారం భీమడోలులో శ్రీసత్యసాయి సేవాసమితి ప్రతినిధులు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీసత్యసాయి బాబా శతజయంతి వేడుకలు సందర్బంగా భీమడోలు, గుండుగొలను సేవాసమితులు ఆధ్వర్యంలో మూడురోజులు పాటు కాలినడకన ఇంద్రకీలాద్రికి వెళ్తున్న భవానీ మాలదారులు, భక్తులకు స్థానిక శ్రీసత్యసాయి బ్రిక్స్ ఫ్యాక్టరీ ఆవరణలో అల్పాహారం, వాటర్ బాటిల్స్ సమకూర్చుతున్నట్లు అదేవిధంగా స్నానం చేసెందుకు ట్యాంకర్ల తో తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.