తాడిపత్రి: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చొరవతోనే నెంబర్ వన్ స్థానం:మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ
తాడిపత్రి పట్టణం మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థానం రావడం ఆనందంగా ఉందని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను 10 కేటగిరీల్లో నిర్ణయిస్తారని చెప్పారు 10 కేటగిరీలోనూ తాడిపత్రి మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థానంలో వచ్చిందని తెలిపారు తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి చొరవతోనే ఈ ఖ్యాతి లభించిందని చెప్పారు. చెత్త సేకరణ దాని రీసైక్లింగ్ ను చేస్తూ పర్యావరణ కాలుష్యం కాకుండా చూస్తున్నామని తెలిపారు.