అహోబిలంలో అంగరంగ వైభవంగా,కార్తీక వనభోజనం మహోత్సవ కార్యక్రమం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకిపై అలంకరించి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు, మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. లక్ష్మీ వనంలో జరగనున్న వనభోజన ఉత్సవానికి శ్రీ స్వామివారి ఉత్సవ పల్లకిని తరలించి పూజలు నిర్వహించారు,అహోబిలం క్షేత్రంలోని ఆళ్వార్ కోనేరు సమీపంలో 2007వ సంవత్సరంలో ఐదు ఎకరాల దేవస్థానం స్థలంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమాన