పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ భువన స్కౌట్స్ విద్యార్థులు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీ భువన స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ విద్యార్థులు బుధవారం చేపట్టారు. పీలేరు ఫారెస్ట్ అధికారులు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని శ్రీ భువన స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు కరస్పాండెంట్ గోరంట్ల ఉమా రమాదేవి మరియు ప్రిన్సిపల్ గుణ లక్ష్మి కి 500మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ భువన స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాల ఆవరణలో స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.