కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పెద్దపీట వేస్తుంది :పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద అమరులకు రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో చేపడుతున్న ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.