అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని పులివెందుల మండలం పెద్ద కడూరు గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ చికిత్స పొందుతూ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.