ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మోనిటరింగ్ సమావేశంలో శనివారం పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గం లో ఎస్సీ ఎస్టీలకు స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని మంత్రి స్వామికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి స్వామి హాస్టల్ అభివృద్ధికి కృషి చేస్తామని స్మశాన వాటిక కేటాయించే అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.