అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం దిరిసనపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా కలపను నరికి నిలువచేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయంపై ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు అటవీశాఖ అధికారులు తెలిపారు. దిరిసిన పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి దగ్గర కొండ ప్రాంతంలో కల్పన అక్రమంగా నరికి నిలవ ఉంచినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని దీనిపై వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. ఎవరు నరికారు అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని, చర్యలు చేపడతామన్నారు.