అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో సోమవారం పదిన్నర గంటల సమయంలో అనంతపురం రెండవ పట్టణ సిఐ శ్రీకాంత్ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి ఒక కేసులో నిందితుడైన అజయ్ కుమార్ ను పట్టుకునేందుకు షికారి కాలనీకి వెళ్లడం జరిగింది ఈ సందర్భంలో అజయ్ కుమార్ తనను పట్టుకునేందుకు వచ్చిన ఇన్ ఫార్మర్ భాషాపైన కత్తితో దాడి చేయడం జరిగింది ఇదే సందర్భంలో చుట్టుముట్టిన శ్రీకాంత్ పైన కూడా కత్తితో దాడి చేయడం జరిగింది సిఐ శ్రీకాంత్ ఆత్మ రక్షణ కోసం నిందితుడి పైన రెండు రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడిన సిఐ శ్రీకాంత్ ,భాషను కూడా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.