తిరుచానల్స్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టంగా నిర్వహించబడే పంచమి తీర్థానికి భక్తుల అశేషంగా రానున్న నేపథ్యంలో తిరుచానూరు పుష్కరిణి హోల్డింగ్ పాయింట్లు క్యూ లైన్ లో ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్ట బందోబస్తు భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి సంబంధించిన ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో పాటు టిటిడి సిబిఎస్ఓ మురళీకృష్ణ కలిసి పరిశీలించారు. 120 సీసీ కెమెరాలు తొమ్మిది డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు.