ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి వృద్ధురాలి మెడలోని 5తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారైన యువకులు
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఒంటరి మహిళ అయిన వృద్ధురాలు మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును ఇద్దరు యువకులు తెంపుకొని పరారయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని రామా కాలనీకి చెందిన అక్కరపు సత్యవతి ఇంటికి సోమవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.