సర్వేపల్లి: ప్రతి ఇంట్లో జనసేన గుర్తు గాజు గ్లాసు ఉండేలా చర్యలు : సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జి సురేష్
సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో జనసేన పార్టీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు ఉండేలా ప్రచారం చేస్తున్నామని నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలం మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాత్రి తొమ్మిది గంటల దాకా సురేష్ నాయుడు పర్యటించి, జన సైనికులతో మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.