తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు సోమవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వాడు వాడాలలో తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు రోగులకు పండ్లు కాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.