పూతలపట్టు: కాణిపాకం నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి
చిత్తూరు జిల్లా కాణిపాకం బైపాస్ నాలుగురోడ్ల వద్ద మంగళవారం 12 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, మూర్తిగాని ఊరుకు చెందిన సుబ్రహ్మణ్యం తన కుమారుడి పెళ్లి పనుల కోసం బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.