వినుకొండ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 49 మంది లబ్ధిదారులకు 32 లక్షల 89 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.