గుంతకల్లు: గుత్తిలో ఓ సినిమా థియేటర్లో వాచ్మెన్ కు విషపురుగు కాటు, ఆసుపత్రికి తరలింపు
గుత్తి పట్టణంలోని ఓ సినిమా థియేటర్లో వాచ్ మెన్ గా పనిచేసే సుంకన్న అనే వ్యక్తి విషపురుగు కాటుకు గురయ్యాడు. గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన సుంకన్న గత కొంతకాలంగా గుత్తిలోను ఓ సినిమా థియేటర్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సుంకన్నను విషపురుగు కాటువేసింది. వెంటనే అతన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.