వనపర్తి: ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి ఇండోర్ స్టేడియం : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం పునర్ధారణ పనులను పరిశీలించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ. ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఇండోర్ స్టేడియంలో అందుబాటులోకి తెస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ సూచించారు ఇందులో బ్యాట్మెంటన్ కోర్టు క్యారం టేబుల్ టెన్నిస్ జిమ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇండోర్ స్టేడియం ఎంతగానో దోహదం పడుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.