సిర్పూర్ టి: కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు రెండవ రోజు కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన రెండవ రోజు కొనసాగుతుంది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టినట్లు కార్మికులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగ లు జీతాలు రాకపోవడంతో చేసుకునే పరిస్థితి లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి వేతనాలను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు,