పాముదుర్తి గ్రామంలో టిడిపి నుండి వైసీపీలోకి చేరిక
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. గురువారం సాయంత్రం పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు టీడీపీ కి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి లోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.