మాచర్ల పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది అధికారులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో 26 గేట్లు ఎత్తి నీటిని దిగుకు వదులుతున్నారు. ఇన్ఫ్లో నాలుగు లక్షల 36,740 క్యూసెక్కులు, హౌ టు ఫ్లో ఐదు లక్షల 81,668 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులుగా వుంది. దసరా సెలవులు కావడంతో ప్రజలు ప్రాజెక్టును చూసేందుకు తరలివస్తున్నారు. ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సందడిగా గడుపుతున్నారు.