రాయదుర్గం: గనిగెర గ్రామంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్యాధికారులు
కణేకల్లు మండలం గనిగెర గ్రామంలో మహిళల ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి పై స్థానిక పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సౌందర్య అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 'స్వాస్త నారీ స్వ శక్తి పరివార్' కార్యక్రమంలో భాగంగా గురువారం వైద్య అవగాహన శిభిరం ఏర్పాటు చేసి మహిళలకు చికిత్స అందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.