' ప్రజలు తనను నేరుగా కలవచ్చు' : నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ అజిత
నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా అజిత జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లాకి తొలి మహిళా ఎస్పీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన జిల్లాని మరింత ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని Sp అజిత తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రిస్తామన్నారు. ప్రజలు తనను నేరుగా కలవచ్చని, అందరికి అందుబాటులో ఉంటానని వివరించారు. గంజాయిని కంట్రోల్ చేసి, యువతకు అవగాహనా కల్పిస్తామని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో తెలిపారు.