ఆదోని: ఆదోనిలో అంతరాష్ట్ర పశువుల దొంగలు అరెస్టు.. రూ.కోటికి పైగా విలువైన పశువులు స్వాధీనం
Adoni, Kurnool | Sep 16, 2025 కర్నూలు జిల్లాలో కొన్నేళ్లుగా పశువులను దొంగలిస్తూ, అడొచ్చిన వారిని క్రూరంగా రాళ్లు, సోడా సీసాలతో దాడులు చేసిన ముఠాను ఆదోని వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణ శివారులో 2 బొలెరో వాహనాలను, కారును స్వాధీనం చేసుకొని, సుమారు 16 మందిని అదుపులోకి తీసుకొన్నట్లు డీఎస్పీ హేమలత తెలిపారు. సుమారు రూ.1.49 కోట్ల విలువ గల 542 పశువులను రికవరీ చేశామన్నారు.