నాయుడుపేట రహదారిలో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు
- ప్రమాద సూచికలు లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదం
తిరుపతి జిల్లా నాయుడుపేట - మల్లాం రహదారిలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ రహదారి విస్తరణలో భాగంగా బ్రిడ్జి పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి వాటికి రేడియం స్టిక్కర్లు అంటించకపోవడంతో స్పీడ్ గా వచ్చే వాహనదారులకు ముందు రోడ్డు లేదన్న విషయం తెలియక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు లైటింగ్ స్టిక్కర్లు కనిపించకపోవడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో బైకులు పడిపోవడం, చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నవి. ఈ క్రమంలో ఆదివారం ఓ బైకు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైన