సుండుపల్లి: స్థానిక అధికారి పార్టీ వాళ్లు నా పట్టా భూమిని కబ్జా చేశారు : డేరంగుల సతీష్
సుండుపల్లి మండలంలో అధికార పార్టీలోని కొందరు స్థానిక నాయకులు తమ పట్టా భూమిని కబ్జా చేశారని డేరంగుల సతీష్ ఆరోపించారు. బుర్రల దిన్నె పల్లె సమీపంలోని 3.59 ఎకరాల భూమిపై ఇసుక ఇటుకలు కరెంట్ పోల్స్ వేసి బలవంతపు ఆక్రమణ జరిపారని తెలిపారు.' అధికారులు మా చేతుల్లో ఉన్నారు' అంటూ బెదిరింపులు కూడా దిగారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.